డ్యాన్స్‌లు వేయమని నీకు మంత్రి పదవి ఇచ్చారా : అంబటి రాంబాబుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పోలవరంలో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని ప్రశంసించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదిలిందంటే అందుకు కరాటం రాంబాబే కారణమని , ప్రాజెక్ట్ కోసం వారి కుటుంబం దాదాపు 110 ఎకరాలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జనసేన స్థాపించిన నాటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని ఆయన తెలిపారు. తెలుగుదేశం హయాంలో 2018 నాటికి పోలవరం దాదాపు 50 శాతం పూర్తయ్యిందని పవన్ గుర్తుచేశారు. కానీ జగన్ సీఎంగా పగ్గాలు అందుకున్న తర్వాత పోలవరంపై ఎన్నో కథలు చెప్పారని .. పునరావాస ప్యాకేజీలు అమలు చేస్తామని గిరిజనులు సహా అందరిని నమ్మించారని జనసేనాని దుయ్యబట్టారు.
వైసీపీకి పోలవరం ఏటీఎంలా మారిందని.. డబ్బులు కావాలంటే పోలవరంలో ఏదో ఒక చిన్న పని మొదలుపెడితే చాలని, దోచుకో అన్నట్లుగా పరిస్ధితులు మారాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పోలవరం గురించి అడిగితే అంబటి రాంబాబు నీకెందుకు అంటాడని.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను అడిగితే వెటకారంగా మాట్లాడతాడని ఆయన దుయ్యబట్టారు. డ్యాన్సులు వేయడానికా అంబటికి మంత్రి పదవి ఇచ్చిందని జనసేన చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను కేంద్ర మంత్రులతో మాట్లాడానని .. పోలవరం పరిధిలోని 1.60 లక్షల మంది నిర్వాసితులను ఆదుకునేందుకు రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని అన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్‌లో ఇదే సంక్లిష్టమైన పని అని.. దీని నుంచి తప్పించుకోవడానికే జగన్ పోలవరాన్ని చంపేశాడని జనసేనాని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులకు కోటి విరాళం ప్రకటించారు పవన్ .
Pawan Kalyan: అంబటికి మంత్రి పదవి ఇచ్చింది డ్యాన్స్‌లు చేయడానికా?: పవన్ కల్యాణ్#PawanKalyan #Janasena #AmbatiRambabu #ysrcp #APNews #TeluguNews pic.twitter.com/3aR4R6zb8l
— Eenadu (@eenadulivenews) April 30, 2024
Comments
Post a Comment